
మాజీ ఎంపీటీసీ కి పిర్యాదు చేసిన గాంధీ ఏరియా ప్రజలు.
వైర్లను తాకుతున్న చెట్ల కొమ్మల తొలగింపజేసిన మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వాయిస్ టుడే ప్రతినిధి ఏప్రిల్ 16: తరచూ విద్యుత్ సరఫరా లో అవాంతరాలు ఏర్పడడం ,బ్రేక్ డౌన్ కావడం దీంతో గాంధీ ఏరియా ప్రజలు ఇబ్బందులు విద్యుత్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఎల్లారెడ్డి పేట లోని గాంధీ ఏరియా ప్రజలు స్థానిక మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు పిర్యాదు చేశారు.గాంధీ ఏరియా లో శ్రీ కృష్ణ మెడికల్ హల్ వద్ద విద్యుత్ స్తంభం పై గల వైర్లు వెంట్రుక వాసి మందంలో ఉన్నాయని ఎప్పుడు తెగిపోతాయో అర్థం కాని పరిస్థితి ఉందని ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు.అదే విధంగా మూడవ వార్డు లో మహమ్మద్ సైఫ్ ఇంటి వద్ద వైర్ల కు ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలతో తరచూ విద్యుత్ బ్రేక్ డౌన్ అవుతుందనీ అక్కడి వారు బాలరాజు యాదవ్ కు పిర్యాదు చేశారు.విద్యుత్ వైర్లను సరి చేయాలనీ సెస్ ఏ.ఈ పృథ్వి థర్ కు, వైర్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగింపజేయాలని పంచాయతీ కార్యదర్శి దేవరాజు కు వివరించారు. ఇరు శాఖల అధికారుల దృష్టికి సమస్యను తీసుకు వెళ్లిన బాలరాజు యాదవ్ సెస్ సిబ్బంది ఏనుగుల వెంకటేష్ యాదవ్,హాబీబ్ తో ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ సరఫరా నిలిపి వేయించి గాంధీ ఏరియా లో గల విద్యుత్ తీగలను సరి చేయించి చందనం సతీశ్ వారి కట్టే కోత మిషన్ సిబ్బంది తో వైర్ల కు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను బాలరాజు యాదవ్ సరి చేయించారు.విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగకుండా సరి చేయించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ కు గాంధీ ఏరియా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.