- Advertisement -
బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అల్పాహార పంపిణీ
Breakfast distribution to class 10 students in a girls school
మంథని
మంథని బాలికల ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు దాతల సహాయంతో అల్పాహారాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత పంపిణీ చేశారు. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు చౌడారపు శ్రీనివాస్ వారి తల్లి గారి జ్ఞాపకార్థం నెల రోజుల పాటు 50 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పది రూపాయల విలువచేసే అల్పాహారాన్ని అందించారు. అదేవిధంగా మల్హర్ మండల్ లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గజాడి మహేష్ 50 మంది విద్యార్థులకు ఐదు రోజులకు సరిపడా అల్పాహారాన్ని అందించారు. వాటిని శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులకు సాయంత్రం ఐదున్నర వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున అల్పాహారం లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని దాతల దృష్టికి తీసుకురాగా వారు అల్పాహారాన్ని అందించడం జరిగింది. అల్పాహారం అందించిన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,మహేష్ కు పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
- Advertisement -