- Advertisement -

ఇంద్రకీలాద్రిలో బ్రో చిత్రబృందం ప్రత్యేక పూజలు
విజయవాడ: బ్రో చిత్రం విజయోత్సవంలో భాగంగా చిత్ర బృందం ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకుంది. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్ర ఖని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేయించారు. తరువాత అమ్మవారి చిత్రపటాన్ని లడ్డు ప్రసాదాన్ని అందించారు.
- Advertisement -



