Breaking News
Saturday, July 27, 2024
Breaking News

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో కాంస్య పతకం

- Advertisement -

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో కాంస్య పతకం

జగిత్యాల

కరీంనగర్ రేకుర్తిలోని లయోలా విద్యాలయంలో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఉమెన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు తృతీయ స్థానం కైవసం చేసుకుంది. ఈ జట్టులో స్థానిక తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల కు చెందిన ఈదునూరి అఖిల అనే తృతీయ సంవత్సరం విద్యార్థిని పాల్గొని జట్టు విజయానికి కృషి చేసిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వి. వెంకటేశ్వర్ రావు, బి. లక్ష్మన్ తెలిపారు. ఈ విద్యార్థిని ప్రతిభను కళాశాల ప్రిన్సిపాల్ డా. గోలి శ్రీలత, ఫిజికల్ డైరెక్టర్ డా. లావుడియా హరీరామ్, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!