విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చి అవకతవకలకు పాల్పడిన జగన్ రెడ్డి బావమరిది

- Advertisement -

విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చి అవకతవకలకు పాల్పడిన జగన్ రెడ్డి బావమరిది

Brother-in-law of Jagan Reddy made university political center done irregularities

చంద్రబాబుపై రాళ్లు వేసిన వారినే నెత్తిన పెట్టుకుంటున్నారం &టూ టీడీపీ నేతలు ఫిర్యాదు
పనులు చేయకుండానే లక్షలు కొట్టేసిన వైసీపీ నాయకుడిపై చర్యలకు వినతి
భూ కబ్జాలు.. ఆన్ లైన్ సమస్యలపై పోటెత్తిన భూ బాధితులు
సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం, ఉద్యోగాలు, పింఛన్ లతో పాటు పలు సమస్యలపై పోటెత్తి వచ్చిన అర్జీదారులు

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిల బావమరిది వైవీయూ ప్రొఫెసర్, ఈసీ  సురేంధ్రనాథ్ రెడ్డి యోగివేమన విశ్వవిద్యాలయాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని  ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని..  విశ్వవిద్యాలయంలో  వైసీపీకి అనుకూలమైన వ్యక్తులను నియమించుకుని అవినీతి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని.. గత ప్రభుత్వం అండతో వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా చట్టాలను నిబంధనలను తుంగలో తొక్కి..  ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీవేజెస్ ఇతర బోధనేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించకుండా.. అక్రమాలకు తెరలేపారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి వి. గంగా సురేష్ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలను కలిసి ఫిర్యాదు చేశాడు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా వినతులు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లాశ్రీనివాసరావు, శ్రీరామ్ చిన్నబాబులు  సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థి సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.  సమస్యలపై వచ్చిన ఇతర అర్జీదారులనుండి వినతులు స్వీకరించారు.
గత వైసీపీ పార్టీతో అంటకాగి..  ఆ పార్టీకోసం పోస్టల్ ఓట్లను కూడా వైసీపీకి వేయించిన అధికారులను వెనకేసుకు రావడం.. టీడీపీ అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనపై రాళ్లు వేయించిన వారిని నేడు నెత్తిన పెట్టుకోవడం వలన యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పూర్తిగా నష్టపోతుందని దీన్ని పార్టీ పెద్దలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం నుండి వచ్చిన పలువురు టీడీపీ నేతలు  నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగాంట్  గ్రామానికి చెందిన. ఎస్. శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి. జయరామరెడ్డి పనులు చేయకుండా లక్షల్లో డబ్బులు దోచుకున్నాడని..  తాగునీటి బోర్లు వేయకుండా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయకుండా చేసినట్లు చూపించి డబ్బులు మింగారని విచారించి చర్యలు తీసుకోవాలని నేతలకు ఫిర్యాదు చేశాడు.
• తాము ఉపాధికోసం ఊరువిడిచి వెళితే వచ్చేసరికి తమ తండ్రి తమకు ఇంటికోసం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించారని..  ఆక్రమణదారుల నుండి తమ స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని  కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం  మధిరపాడు గ్రామానికి చెందిన దొరగుడి ప్రభుదాసు నేతలకు విన్నవించుకున్నాడు.

ఎమ్మార్వో, వీఆర్వో లు ఎటువంటి విచారణ జరపకుండా పై అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి తమకు అన్యాయం చేశారని.. సర్వేనెంబర్ లు మార్చి మోసం చేశారని.. తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జల్లా వీకోట మండలం మద్దిరాళ్లగ్రామానికి చెందిన నారాయణస్వామి నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.

• అనంతపురం మండలం సంగమేశ్వరకాలనీకి చెందిన చింతా నారాయణ విజ్ఞప్తి చేస్తూ.. శంకర పెద్దన్న అనే వ్యక్తి తమ భూమికి గవర్నమెంట్ సర్వేయర్ తో సర్వేచేయించి రాళ్లు పాతిస్తామని చెప్పడంతో అతనికి రూ. 40,000 ఇచ్చామని.. తీరా చూస్తే.. దొంగ సర్వే చేసి దొంగ పత్రాలు  ఇచ్చి పోయారని తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.

• కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లద్దిపల్లె గ్రామానికి చెందిన మాల వరాదమ్మ విజ్ఞప్తి చేస్తూ.. 2011 లో ప్రభుత్వం ద్వారా పట్టా పొంది ఇప్పటికి తమ స్వాధీనంలో ఉన్న భూమిని తమదంటూ.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సురేష్ తమను బెదిరిస్తునాడని.. తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
• తన భర్త చనిపోయాడని.. తన పేరు గుమ్మడి సుశీలమ్మని  తనది గుంటూరు జిల్లా చుండూరు మండలం దున్దిపాలెం గ్రామమని..  తన భర్త పేరున మంజూరైన ఇంటి స్థలాన్ని తన పేరుమీద మార్చమంటే వీఆర్వో  బట్టు బాలశౌరి రూ. లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడని తనకు న్యాయం చేయాలని ఆమె నేతల ముందు వాపోయింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular