కంటోన్మెంట్, అక్టోబర్ 27(వాయిస్ టుడే ప్రతినిధి): కంటోన్మెంట్ లో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. సంక్షేమ పథకాల బీఆర్ఎస్ కు జనమంతా జై కొడుతున్నారని గుర్తు చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసిన కంటోన్మెంట్ లో గులాబీజెండా ఎగరడం ఖాయమని లాస్యనందిత ధీమా వ్యక్తం చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 1వ వార్డులో పాదయాత్ర నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి బోయిన్ పల్లి పెద్ద తోకట్ట, కట్టెల మండి, కంసారి బజార్, చింతల్ బస్తీల్లో లాస్య అనందిత పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికీ తిరిగి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ, బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకు సాగారు.
లాస్యనందిత మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రజా మేనిఫెస్టోను చూసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని లాస్యనందిత తెలిపారు. రైతు వ్యతిరేక ధోరణితో ముందుకెళ్తున్న కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చొరవతో వందలాది మందికి ఇళ్లు వచ్చాయని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆరేనని.. ఆ హామీలను అన్నింటినీ నెరవేర్చడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అంటే మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు. పాదయాత్రలో తనకు వస్తున్న స్పందన చూస్తుంటే… కంటోన్మెంట్ లో భారీ మెజార్టీతో గులాబీ పార్టీ గెలవడం ఖాయమని లాస్యనందిత ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ అంటే సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. కాంగ్రెస్, బీజేపీల మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. కచ్చితంగా లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. పాదయాత్రలో మహిళలంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు సంపూర్ణ మద్దతు పలికారు. మాఓటు మీకేనంటూ మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత, రామక్రిష్ణ, శ్రీనివాస్, మీనా భాస్కర్, అసిమ్ ఖాన్, ఇర్ఫాన్, నవీన్, పద్మ, ప్రభు గుప్తా, పలువురు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, యువ నాయకులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ అంటే మాటల పార్టీ కాదు చేతల పార్టీ
- Advertisement -
- Advertisement -



