Saturday, March 28, 2026

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలి

- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టులు చేయాలి

BRS MLAs should be drug tested

రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్
హైదరాబాద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ డ్రగ్స్ టెస్ట్ లు చేయాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పోలీసులకు విజ్ఞప్తి చేసారు. డ్రగ్స్ బయట పడిన ప్రతి సారి వాళ్ళు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు ఉంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. రాజ్ పాకాల,విజయ్ మద్దూరిని వెనుకేసుకరావడానికి కేటీఆర్ కి సిగ్గు ఉండాలి. కేటీఆర్ కు అసలు బినామీ విజయ్ మద్దూరి . గతం ప్రభుత్వం  డ్రగ్స్ కేసుని ఏ విధంగా దారి మళ్లించారో ప్రజలకు తెలుసు.  జన్వాడ పామ్ హౌస్ అంటే నే కాంట్రవర్సీ.  ఒక సారి దీపావళి పెస్టివల్,ఇంకో సారి గృహ ప్రవేశం అంటున్నారు. డ్రగ్స్ ని స్కూల్ పిల్లల వరకు తీసుకెళ్లిన ఘనత గత ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ ప్రీ రాష్ట్రంగా చేస్తుంటే, వాళ్ళు డ్రగ్స్ ని ప్రేరేపించాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ను కేసీఆర్ కుటుంబం ఏమి చేయాలనుకుంటుంది. స్వయంగా డ్రగ్స్ వాడినట్లు పోలీసుల ముందు విజయ్ మద్దూరి ఒప్పుకుండు. రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చినట్లు విజయ్ మద్దూరి ఒప్పుకుండు. ఇప్పుడు స్టేట్మెంట్ ను మారుస్తుండు. పామ్ హౌస్ దొర కేసిఆర్ డిజిపికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుండు. ఆయనకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది. కేసీఆర్ ఎక్కడ ఉండు అని ప్రజలు అడుగుతున్నారని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్