Sunday, September 8, 2024

రాష్ట్రంలో అభివృద్ధి కొన‌సాగాలంటే మ‌ళ్లీ బిఆర్ఎస్ గెల‌వాలి: తలసాని

- Advertisement -

ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హ్యాట్రిక్ కు ఛాన్స్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు

శుక్రవారం సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసిన గొప్ప నాయకుడు KCR అని పేర్కొన్నారు. ఎవరి మద్దతు లేకుండా నే 78 స్థానాలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో లేని అంశాలు అమ‌లు చేసిన ఏకైక పార్టీ బీఆర్ ఎస్ అన్నారు. నాలుగు వంద‌ల‌కే గ్యాస్ సిలిండ‌ర్ పంపిణీ ని అమ‌లు చేసి చూపిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశ రాజ‌కీయాల్లో కూడా కీల‌క భూమిక పోషించ‌బోతున్నామని చెప్పారు. ప్రపంచ ప్ర‌జ‌ల్ని అక్కున చేర్చుకున్న ప్రాంతం తెలంగాణ‌ అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై BRS పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు సాగుతున్నాయని తెలిపారు. మేమే ఏ టీం అని, తామేవరికి బీ టీం కాదన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశం లో వివక్ష చూపుతుందని విమర్శించారు. విజన్ కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్దిని సాధించిందని వివరించారు. మినీ ఇండియా గా పిలుచుకునే హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పర్యవేక్షణ లో దేశంలోనే ప్రధమ స్థానంలో ఉన్నామని చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుండి నాలాల వరద ముంపు సమస్యను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత SNDP కార్యక్రమం క్రింద పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, ఫలితంగా ఈ సంవత్సరం వరద ముంపు సమస్య పరిష్కారం అయిందని వివరించారు. రోడ్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం, పుట్ పాత్ ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని చెప్పారు. కర్నాటక లో 5 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ ఇవ్వలేని కాంగ్రెస్ కావాలో, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న BRS పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. 40 సంవత్సరాలు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొత్తేమి కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్ధులు కరువై ఇతర పార్టీల నుండి వచ్చిన 27 మందికి MLA టికెట్ లు ఇచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ప్రతి పక్షాలవి అర్ధం పర్ధం లేని విమర్శలు అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కు ఏమైనా డ్యామేజీ జరిగితే ప్రభుత్వం నిర్మాణ సంస్థ నుండి రికవరీ చేస్తుందని, ఒప్పందం ప్రకారం అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. షర్మిల పోటీ నుండి తప్పుకుంటుందని తాను ఎప్పుడో చెప్పానని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, తప్పకుండా ఇస్తామని అన్నారు.ఈ కార్యక్రం లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్