కులగణన తీర్మానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు

- Advertisement -

కులగణన తీర్మానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు
హైదరాబాద్ ఫిబ్రవరి 16
కులగణన తీర్మానానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు తెలిపింది.తీర్మానంపై బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడారు. కులగణన పకడ్బంధీగా నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి గంగుల సూచించారు. అదేవిధంగా కులగణనపై తీర్మానం మాత్రమే కాదు చట్టం చేస్తే బాగుంటుందని అన్నారు.భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన చట్టం ఉండాలని, ఎలాంటి కోర్టు కేసులకు అవకాశం ఉండకూడదని గంగుల సూచించారు. కులగణన పూర్తికాగానే వెంటనే చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కులగణన తర్వాత చట్టం ఎలాంటి పథకాలు అమలు చేయనుందో ముందే చెప్పాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరారు.ఎంబీసీలను మొదటి గుర్తించినదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని గంగుల చెప్పారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బీహార్లో ఇప్పిటికే కులగణన చేశారని, కానీ న్యాయపరమైన చిక్కులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular