- Advertisement -
By ఆముదాల వెంకన్న
ఖమ్మం నగరంలోని ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. మాంట్‌ఫోర్ట్ హైస్కూల్, సెయింట్ జోసెఫ్ హైస్కూల్, ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా, నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
- Advertisement -




