Sunday, September 8, 2024

ఇల్లందు బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”గ్రాండ్ సక్సెస్ అయ్యింది:ఎంపీ రవిచంద్ర

- Advertisement -

అంచనాలకు మించి జనం స్వచ్చంధంగా తరలివచ్చారు:ఎంపీ రవిచంద్ర

ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రసంగాన్ని ప్రజలు శ్రద్ధగా ఆలకించారు:ఎంపీ రవిచంద్ర

ఇల్లందు అభ్యర్థి హరిప్రియ,రాష్ట్రంలో బీఆర్ఎస్ ఘన విజయం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం తథ్యం:ఎంపీ రవిచంద్ర

సభకు వేలాదిగా తరలివచ్చిన,సభ విజయవంతమవ్వడంలో భాగస్వాములైన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు:ఎంపీ రవిచంద్ర

brs-praja-ashirwada-sabha-was-a-grand-success-in-illandu-mp-ravichandra
brs-praja-ashirwada-sabha-was-a-grand-success-in-illandu-mp-ravichandra

ఇల్లందు బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ”గ్రాండ్ సక్సెస్ అయ్యిందని,సభకు వేలాదిగా తరలివచ్చిన అన్ని వర్గాల ప్రజలు, ఇందుకు సహకరించిన వారందరికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.తమ అంచనాలకు మించి జనం సుమారు 85,000మంది సభకు హాజరయ్యారని,కాలినడకన కొందరు, ఊరేగింపుగా మరికొందరు,సొంత వాహనాలపై ఇంకొందరు స్వచ్చంధంగా తరలివచ్చారన్నారు.బీఆర్ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ రవిచంద్ర సభను విజయవంతం చేయడానికి గాను గత వారం రోజులుగా రేయింబవళ్లు గులాబీ శ్రేణులను ఉత్సాహపర్చడం తెలిసిందే.”ప్రజా ఆశీర్వాద సభ”దిగ్విజయం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయనొక ప్రకటన విడుదల చేశారు.

brs-praja-ashirwada-sabha-was-a-grand-success-in-illandu-mp-ravichandra
brs-praja-ashirwada-sabha-was-a-grand-success-in-illandu-mp-ravichandra

సభకు హాజరైన అశేష జనవాహిని మండుటెండను సైతం లెక్కచేయకుండా తమ అభిమాన నాయకులు, తెలంగాణ అభివృద్ధి ప్రధాత, ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన ప్రసంగాన్ని శ్రద్ధాసక్తులతో విన్నారన్నారు.ఇల్లందు అభ్యర్థి హరిప్రియతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పదికి పది, రాష్ట్రంలోని 90కి పైగా సీట్లను బీఆర్ఎస్ గెల్చుకోవడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం తథ్యమని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.సభ విజయవంతం కావడంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు, ప్రెస్ అండ్ మీడియా ప్రతినిధులు, పోలీసులు తదితర వర్గాలకు ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.సభకు గిరిజనులు,ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇందుకు అహర్నిశలు కృషి సల్పిన ఎంపీ రవిచంద్రను ముఖ్యమంత్రి కేసీఆర్ భుజం తట్టి అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్