- Advertisement -
ఉప్పల్ లో బీఆర్ఎస్ నిరసన
BRS protest in Uppal
హైదరాబాద్
కేటీఆర్ ఆదేశాల మేరకు ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు ఎక్కువయ్యాయి. గిరిజనులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది. లఘచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా.. ఉప్పల్ రింగ్ రోడ్ లో భారీగా బిఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు నాయకులు తదితరులు హాజరయ్యారు.
- Advertisement -