- Advertisement -
సూర్యాపేటలో బీఆర్ఎస్ వర్క్ షాప్
BRS Workshop at Suryapetపాల్గోన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట
సూర్యాపేటలో శనివారం బీఆర్ఎస్ పార్టీ వర్క్ షాప్ నిర్వహించారు. రెండోరోజు పెన్ పహాడ్, చివ్వేంల మండల ముఖ్యనేతలు హ జరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులకు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిశానిర్దేశం చేసారు.
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోసాగించడం కాంగ్రెస్ నైజం. ప్రజలకు అండగా నిలబడటం మన బాధ్యత. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మాయలు, మోసలతోనే. అదనంగా ఇంకేదో వస్తదని నమ్మి ప్రజలు ఓట్లెసిండ్రు. మొదటి నెలనుంచే మోసపోయామన్న భావన ప్రజల్లో మొదలైంది. కేసీఆర్ ను తామే దూరం చేసుకున్నామని పశ్చాత్తాపడుతున్నరు. నిరంతర ప్రజాసేవ, అభివృద్ధి పాలనే ఆయన నాయకత్వం నేర్పింది. క్రమశిక్షణకు మారుపేరు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్తలను కంటికి రెప్పలా కపడుకుంటున్న ఏకైక పార్టీ కూడా మనదే. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, బలగం. ఎవరెన్ని కుట్రలు చేసినా ఐక్యత కోల్పోవద్దు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంతో కొట్లాడదాం. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు ప్రజలతో కలిసి పోరాడదాం. కొత్తగా ఇచ్చిన హామీలమాట దేవుడెరుగు.. కేసీఆర్ ఇచ్చినయన్నా వస్తేచాలు అనుకుంటున్నరు. 420 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో క్లారిటీ ఉందా. అభివృద్ధి మరిచి హైడ్రాతో తప్పుదోవ పట్టిస్తున్నరని అన్నారు.
ప్రభుత్వాలపై విశ్వాసం పెంచుకునే పనిమాని.. ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తున్నరు. కేసీఆర్ అభివృద్ధి నిర్మాణాలు చేస్తే.. రేవంత్ కూల్చివేతలతో అరాచకాలు చేస్తున్నడు. తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్ కున్న సోయి కాగ్రెసోళ్లకు వుంటదా. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అంతా నమ్ముతున్నరు. ఆదిశగా ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త ప్రజల పక్షాన అండగా నిలబడాలని అన్నారు.
- Advertisement -




