- Advertisement -
తాపీ మేస్త్రి దారుణ హత్య
Brutal murder of building constructer
రామచంద్రపురం
కె. గంగవరం మండలం కూళ్ళ గ్రామం లో సత్తి సువర్ణ రత్నం( 35) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. తాపి మేస్త్రి గా పనిచేస్తున్నసత్తి సువర్ణ రత్నం(శివ )కు అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. మరో తాపి మేస్త్రి మంచాల వెంకట సూర్య చంద్ర పథకం ప్రకారం సువర్ణ రత్నం ను మద్యం సేవించేందుకు కూళ్ళ- పామర్రు రోడ్డు వద్దకు తీసుకెళ్లారు. మద్యం సేవించిన అనంతరం ఇరువురు గొడవ పడి సువర్ణ రత్న పీక ను మంచాల వెంకట సూర్య చంద్ర బ్లేడ్ తో కోసాడు. తరువాత సూర్య చంద్ర సమీపంలో ని పంట పొలంలోఉన్న బురదలో సువర్ణ రత్నం ను ఉబలో తొక్కి పడేసి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పామర్రు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి తరలించారు.. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ..
- Advertisement -