Sunday, September 8, 2024

జూన్ 6న లోకాయుక్త లో “బుగ్గారం పంచాయతీ”

- Advertisement -

జూన్ 6న లోకాయుక్త లో “బుగ్గారం పంచాయతీ”

తుది విచారణ కొరకు నోటీసులు జారీ చేసిన “లోకాయుక్త రిజిస్ట్రార్”

జగిత్యాల
జగిత్యాల జిల్లా ఉన్నతాధికారుల మీద చేసిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త లో జూన్ 6న విచారణ జరుగనున్నట్లు జారీ చేసిన నోటీసులు బుధవారం ఫిర్యాదు దారునికి అందాయి.
బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, పలు ఆరోపణలతో అదే గ్రామానికి చెందిన చుక్క గంగారెడ్డి గతంలో లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలు సార్లు విచారణ జరిపిన లోకాయుక్త జూన్ 6న తుది విచారణ జరుపనున్నామని నోటీసులు జారీ చేసింది.  ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి కి రిజిష్టర్ పోస్ట్ ద్వారా లోకాయుక్త రిజిస్ట్రార్ పంపిన నోటీసు బుధవారం అందింది. ఈ తుది విచారణతో న్యాయం జరగనున్నట్లు చుక్క గంగారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత – శ్రీనివాస్ గౌడ్, గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా లను సస్పెండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా గత నెలలో రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం పై నేటికీ ఇంకా కూడా అనేక పిర్యాదులు విజిలెన్స్, ఎన్ పోర్స్ మెంట్ రాష్ట్ర కార్యాలయంలో, జగిత్యాల జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మిషన్ భగీరథ కార్యాలయాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ లో కూడా విచారణ పేరుతో అనేక పిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. ఆర్ డబ్ల్యుఎస్, జిల్లా పంచాయతీ, డివిజనల్ పంచాయతీ, మండల పంచాయతీ అధికారుల మీద, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి మీద, పాలక వర్గం మీద కూడా అనేక పిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయని చుక్క గంగారెడ్డి తో పాటు పలువురు గ్రామస్తులు వివరించారు. జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి – అక్రమాలు కూడా చాలా జరిగినట్లు గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు, జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు నేటికీ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ వారికి, దోపిడీ దారులకు, అవినీతి పరులకు, దొంగ రికార్డులు సృష్టించిన వారికి, అక్రమాలు చేసిన వారికే వత్తాసు పలుకుతూ చట్టాలను ఉల్లంగిస్తున్నారని బుగ్గారం వాసులు ఆరోపిస్తున్నారు. అత్యంత విలువైన ఉన్నతాధికారుల విధులను, వారికున్న అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారని గ్రామ ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల నుండి వచ్చిన పిర్యాదులపై ఆయా పైరవీలను బట్టి ఉన్నతాధికారులు విభిన్న రకాలుగా చర్యలు తీసుకోవడం, కొన్ని పిర్యాధులపై ఏ మాత్రం స్పందించక పోవడం జరుగుతుందని అనేక గ్రామాల గ్రామాల పిర్యాదు దారులు అధికారులపై వాపోతున్నారు.
అత్యున్నత న్యాయస్థానం అయిన హై కోర్ట్ ఉత్తర్వులను కూడా కులానికి, వర్గానికి ఒక రకంగా. రాజకీయాలకు ఒక రకంగా అమలు చేస్తున్నారని అనేక మంది బాధితులు, పిర్యాదు దారులు జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులపై మండి పడుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అవినీతి మత్తుతో పాటు, నిర్లక్ష్యం వీడి, వారికున్న బాధ్యతల ప్రకారం సరైన విచారణ జరిపి తప్పు చేసిన వారిపై, ఆ తప్పులకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని బుగ్గారం తో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్