బిల్డింగ్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి::జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

- Advertisement -

బిల్డింగ్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి::జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

Building construction works should be completed quickly::District Collector B. Satya Prasad

మెట్ పల్లి,
బిల్డింగ్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులకు ఆదేశించారు.బుధవారం
పట్టణంలోని మినీ స్టేడియాన్ని గ్రౌండ్ ని క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్,ఆర్డీవో శ్రీనివాస్ కలిసి పరిశీలించారు.ఈ సంధర్భంగా
స్టేడియం ఆవరణలోని ఆగిపోయిన బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
నిర్మాణ దశలోనే ఆగిపోయిన బిల్డింగ్ లను సందర్శించి ఆగిపోయిన పనుల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయిలో బిల్డింగ్ లో ఉన్న చెత్త వ్యర్థాలను పిచ్చి మొక్కలను శుభ్రపరచాలని అధికారులకు ఆదేశించారు.అలాగే మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఆఫీస్కు వచ్చే ప్రజలకు ప్రజ పాలన సేవ కేంద్రంలో  కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వచ్చే దరఖాస్తులను నిరంతరం ప్రక్రియ కావున ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు.అనంతరం మెట్ పెల్లి పట్టణంలోని పురపాలక సంఘంలోని డంపింగ్ యార్డ్ వైకుంఠధామంను కలెక్టర్ పరిశీలించారు.
డంపింగ్ యార్డ్ లో తడి చెత్తను పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు.అలాగే వైకుంఠధామంలో పిచ్చి మొక్కలను పూర్తిస్థాయిలో తొలగించాలని నీటి సదుపాయం కల్పించాలని ఆవరణలో ఉన్న వ్యర్ధాలను వస్తువులను పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట, ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, రెవిన్యూ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular