జూబ్లీ బస్ స్టేషన్ లో నిలిచిపోయిన బస్సులు
సికింద్రాబాద్..
Buses stranded at Jubilee Bus Station.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జూబ్లీ బస్ స్టేషన్ లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.ఉత్తర తెలంగాణ కు
వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను తీర్చాలని యూనియన్
నాయకులు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి ఆర్టీసీ కార్మికులే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీని
ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఆర్టీసీలో పని చేసే వారికి పిఆర్సి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని ఇదే విషయమే పలుమార్లు అధికారులతో చర్చలు జరిగినప్పటికీ విఫలం
కావడంతోనే తాము సమ్మె నోటీసు వచ్చి సమ్మెకు దిగినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



