34.8 C
New York
Saturday, June 22, 2024

బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు

- Advertisement -

బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు

కర్నూలు
వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్‌ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు..
ఆమె అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అఫిడవిట్‌ ప్రకారం.. రేణుక, ఆమె భర్త శివనీలకంఠ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.161.21 కోట్లు. చరాస్తులు రూ.142.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు. అప్పులు రూ.7.82 కోట్లు. 2014లో వీరి ఆస్తులు రూ.242.60 కోట్లు.

ఆమె ఆటోమొబైల్స్‌, హోటళ్లు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. హోండా, టాటా మోటార్స్‌ వాహనాల డీలర్‌షిప్‌ కలిగి ఉన్నారు. బుట్టా కన్వెన్షన్‌ హాలు నడుపుతున్నారు.

హైదరాబాద్‌ మాదాపూర్‌, ఇజ్జత్‌నగర్‌లలో ప్లాట్లు, భవనాలున్నాయి. 2,375 గ్రాముల బంగారం, వజ్రాల హారాలు, విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలున్నాయి. వీటి విలువ రూ.2.54 కోట్లు. రేణుక భర్త పేరిట 435 గ్రాముల బంగారు నగలున్నాయి.

బుట్టా దంపతులకు తేజస్వి జ్యువెలర్స్‌లో రూ.11.10 కోట్లు, తేజస్వి మోటార్స్‌లో రూ.24 కోట్లు, బుట్టా హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.17.46 కోట్లు, బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.59.68 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి.

ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు రేణుకపై హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల న్యాయస్థానంలో మూడు కేసులు నడుస్తున్నాయి. కర్నూలులో ఒక కేసు ఉంది.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!