నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు
జగిత్యాల
నాణ్యత గల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శుక్రవారం రోజున కోరుట్ల, కథలాపూర్ మండలాల్లోని మోహనరావుపేట , వెంకటాపూర్, ఏకిన్ పూర్ , సిరికొండ, దులూరు, బొమ్మేన గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల నుండి కొనుగోలు చేసే వరి పంటను నాణ్యత గల వరి నీ కొనుగోలు చేయాలని కేంద్రం ఇంఛార్జి లను ఆదేశించారు. కేంద్రంలో నిర్వహిస్తున్న రిజిస్టర్ లను అడనపు కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో నీడ ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.