- Advertisement -
డిసెంబర్ 2025 నాటికి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు పూర్తి
By December 2025, the construction of Tims Hospitals will be completed
హైదరాబాద్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నాడు ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ పై సమీక్ష జరిపారు. 897 కోట్ల అంచనాలతో ఆల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. 11.53 లక్షల స్క్వేర్ ఫీట్లలో హాస్పిటల్ నిర్మాణం వుంటుంది. 90% నిర్మాణ పనులు పూర్తయ్యాయని అన్నారు. ధర్మశాల నిర్మాణం చేపట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు. సనత్ నగర్, ఎల్బీ నగర్ టిమ్స్ నిర్మాణాల్లో ధర్మశాల ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు నిర్మించడం లేదని అధికారులను నీలదీసారు.శాఖల మధ్య సమన్వయం లేకనే ఇబ్బందులని అన్నారు. 35 డిపార్ట్మెంట్ సేవలు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు వివరించారు. 24 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయన్ని అన్నారు. నిర్మాణంలో శాఖల మధ్య సమన్వయం లేక పనులు ఆలస్యం అవడం బాధాకనయని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి టిమ్స్ హాస్పిటల్ నిర్మాణాలపై ప్రత్యేకశ్రద్ధ చూపిస్తున్నారు. అయన 2025 డిసెంబర్ నాటికి ఎట్టిపరిస్థితుల్లో సనత్ నగర్, ఎల్.బీ.నగర్, అల్వాల్ టిమ్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం టిమ్స్ ఆల్వాల్ పనులు త్వరలో పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభిస్తాం. టిమ్స్, ఎల్.బీ నగర్ పనులు భూమి సమస్య కారణంగా పనుల్లో జాప్యం జరిగింది. వాస్తవానికి 2021 నిర్మించాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు 27% శాతానికి మించి పనులు కాలేదు. నేను మంత్రి పదవి చేపట్టాక ముఖ్యమంత్రి తో చర్చించి ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నానని అన్నారు.
- Advertisement -