Sunday, April 6, 2025

ఎంపీ వద్దిరాజు,విప్ ఆది మున్నూరుకాపులకు పిలుపు*

- Advertisement -
ఎంపీ వద్దిరాజు,విప్ ఆది మున్నూరుకాపులకు పిలుపు*
Call to MP Vadviraju, Whip Adi Munnurukapu* 
————– మున్నూరుకాపులందరం రాజకీయాలకు అతీతంగా మరింత ఐకమత్యంతో ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.మనమంతా సంఘటితంగా ఉండడం ద్వారానే న్యాయమైన హక్కుల్ని, డిమాండ్స్ ను సాధించుకోగల్గుతామన్నారు.మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ శనివారం నగరంలోని రాజరాజేశ్వరీ గార్డెన్స్ హాలులో అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుటం పురుషోత్తమ రావు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, అపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ ఆది శ్రీనివాస్, కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావులు మాట్లాడారు.ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,చాలా కాలంగా మనం కోరుతున్న మున్నూరుకాపు కార్పోరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి బడ్జెట్లో 50కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు.అవసరమయితే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న మనకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం విచారకరమన్నారు.త్వరలో జరుగుతుందనుకుంటున్న మంత్రివర్గ విస్తరణలో మున్నూరుకాపు బిడ్డకు తప్పకుండా అవకాశం వస్తుందని భావిస్తున్నానన్నారు.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అపెక్స్ కౌన్సిల్ గౌరవ ఛైర్మన్ గా కొనసాగేందుకు అంగీకరించడం పట్ల సమావేశం హర్షం ప్రకటించింది.కార్పోరేషన్ ఏర్పాటు చేసి 50కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అపెక్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి వర్గములో మున్నూరు కాపులకు స్థానం కలిపించాలని కోరింది, బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడు, కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ పుంజాల శివశంకర్ గారి విగ్రహాన్ని నగరం నడిబొడ్డున  ఏర్పాటు చేయాల్సిందిగా సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.సంఘం క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా సుంకరి బాలకిషన్, సంఘానికి చెందిన వివిధ కుల సంఘాలను సమన్వయము చేసే బాధ్యత  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కి అప్పగిస్తూ సబ్ కమిటీ కన్వీనర్ బాధ్యత లు అప్పగిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం చేయడం జరిగింది .సంఘం జిల్లా శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు,కార్యవర్గాలు,అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్ లు, మండల అధ్యక్షులు, కోఆర్డినేటర్ లతో విస్తృత స్థాయి సమావేశాన్ని అపెక్స్ కౌన్సిల్ త్వరలో ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానించింది.ఈ సమావేశంలో కౌన్సిల్ కోర్ కమిటీ సభ్యులు సీ.విఠల్,రౌతు కనకయ్య,మీసాల చంద్రయ్య,సుంకరి బాలకిషన్ రావు సభ్యులు శ్రీరామ్ చక్రవర్తి, సత్తుమల్లేషం మణికొండ వెంకటేశ్వర్లు,మరికల్ పోత సుధీర్ కుమార్,ఊసా రఘు,మామిండ్ల అంజయ్య, అనిల్ లవంగాల, వెంగల రమేష్,విష్ణు జగతి,ఆవుల రామారావు, కొత్త లక్ష్మణ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్