Sunday, January 19, 2025

క్యాన్సర్ పై ప్రచార భేరి

- Advertisement -

క్యాన్సర్ పై ప్రచార భేరి

Campaign against cancer

ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ కు సిద్ధమైన సర్కారు

దాదాపు 50 వేల మందికి పైగా అనుమానిత క్యాన్సర్ బాధితుల గుర్తింపు

రోగులకు ప్రభుత్వాస్పత్రులలో ఉచిత చికిత్సకు ఏర్పాట్లు

క్యాన్సర్ నివారణే లక్ష్యంగా  వైద్య ఆరోగ్యశాఖ సన్నాహాలు

అమరావతి:
రాష్ట్రంలో ఏటా దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంటున్న క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
గతేడాది నవంబర్ 14 నుండి ప్రారంభమైన స్క్రీనింగ్ పది నెలల పాటు కొనసాగుతుంది.
డాక్టర్ ఎన్ టిఆర్ వైద్యసేవ ద్వారా క్యాన్సర్ చికిత్సలకు 2019-20లో రు.217 కోట్లు ఖర్చు పెట్టగా, 2023-24 నాటికి అది రూ.624 కోట్లకు పెరిగిందని వైద్యఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  18 సంవత్సరాల పైబడిన వారికి నోటి, రొమ్ము క్యాన్సర్, 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతోంది.  విస్త్రుత స్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో 155 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 238 జిల్లా ఆస్పత్రుల నిపుణులు, 3,944 మంది వైద్యాధికారులు, 10,032 మంది సామాజిక ఆరోగ్యాధికారు(సిహెచ్ఓ)లు, 3,944 మంది ఎఎన్ఎంలు, 42 వేల మందికి పైగా సామాజిక ఆరోగ్య కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ముందు సామాజిక స్థాయి స్క్రీనింగ్లో భాగంగా ఆశా కార్యకర్తలు క్యాన్సర్ వ్యాధి దుష్ర్పభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేస్తారు.  ఎఎన్ఎం, సిహెచ్ఓలు అసాంక్రమిక వ్యాధుల (ఎన్సిడి) సర్వేలు నిర్వహించి మహిళలు సర్వైకల్ పరీక్షలు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.  ప్రాథమిక రోగ నిర్ధారణ కోసం బిపి, ఆర్ బిఎస్, హిమొగ్లోబిన్, నోటి, రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు.  గ్రామీణ ఆరోగ్యకేంద్రం స్థాయిలో జరిపే స్క్రీనింగ్లో వైద్యాధికారులు అనుమానిత కేసులను పరిశీలించనున్నారు.  అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నిర్ధారించి చికిత్స అందచేస్తారు. అనుమానిత క్యాన్సర్ కేసులను ఉన్నత స్థాయి వైద్య కేంద్రాలకు రిఫర్ చేస్తారు.  రోగ నిర్ధారణ కోసం బిపి, ఆర్ బిఎస్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వ్యాధుల నిర్ధారణ కోసం VIA పరీక్షతో పాటు హెచ్ఐవి, హెచ్ సివి, హెచ్బిఎస్ఎజి వంటి వాటి కోసం వైరల్ మార్కర్ల పరీక్షలు నిర్వహించి నివారణ కోసం ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ కు రిఫర్ చేస్తారు. అంకాలజీ యూనిట్ (పిఓయు) స్థాయిలో సూపర్ స్పెషలిస్ట్ సమక్షంలో రోగ నిర్ధారణ, చికిత్స అందిస్తారు.  దీనికోసం రాష్ట్రంలో 17 పిఓయులను ఏర్పాటు చేశారు.  ఈ కేంద్రాలలో బయాప్సీ, రేడియాలజీ పద్ధతుల ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమో థెరపీ, రేడియేషన్ శస్త్రచికిత్సల వంటి వాటిని ప్రభుత్వ, అనుబంధ ఆస్పత్రులలో ఉచితంగా అందజేస్తారు.  ఇప్పటి వరకూ దాదాపు 53,07,448 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 19,447 మంది నోటి క్యాన్సర్, 15,401 మంది రొమ్ము క్యాన్సర్, 17,373 మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనుమానితులను గుర్తించారు.  క్యాన్సర్ వ్యాధి సంపూర్ణ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ కోరుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్