- Advertisement -
రిజర్వాయర్ల కెనాల్ భూసేకరన వేగవంతం చేయాలి
Canal dredging of reservoirs should be expedited
సిద్దిపేట
రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ల డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్పరెన్స్ హల్లో రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ రిజర్వాయర్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ భూసేకరణ ప్రక్రియ గూర్చి ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రిజర్వాయర్ కెనాల్ గురించి పూర్తి వివరాలను కలెక్టర్ కి వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని పంపిణీ ప్రక్రియ కు సంబంధించిన మెజర్ కెనాల్ పనులు దాదాపు పూర్తయిన మైనర్ మరియు సబ్ మైనర్ కెనాల్ యొక్క భూసేకరణ ప్రక్రియ పూర్తి అయుతే జిల్లాలో ఆయకట్టు గణనీయంగా పెరిగే ఆస్కారం ఉందని తెలిపారు. భూసేకరణ అనేది ఆయా గ్రామాల్లో ఒక్కో కారణం చేత అడ్డంకులు ఎదురవుతున్నందున్న అన్ని విషయాలను నోట్ చేసుకుని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు పీల్డులో ఒక ప్రక్కా ప్రణాలికతో వెళ్లాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కెనాన్ నిర్మించేందుకు కావలసిన భూసేకరణ వివిధ మండలాల వారీగా మండల రెవెన్యూ, ఇరిగేషన్ ఒక టీం గా ఏర్పడి ఆయా గ్రామాల్లో కాలువల భూసేకరణ వేగవంతంగా జరపాలి. కాలువలో వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ భూసేకరణ జరపాలని అధికారులు ఆదేశించారు.
ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఆక్యువెషన్, గీత, ఆర్డిఓ సదానందం, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -