- Advertisement -
ఈ నెల 3న క్యాన్సర్ అవగాహన డ్రోన్ షో
Cancer Awareness Drone Show on 3rd of this month
హైదరాబాద్
ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 3న క్యాన్సర్ అవగాహన డ్రోన్ షో ను నిర్వహిస్తున్నట్లు కామినేని ఆస్పత్రి ఆంకాలజీ వైద్య నిపుణులు కిరణ్ కుమార్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను వైద్యులు జయంతి, అవినాష్ రెడ్డి, వెంకట సింహ, అనీ క్యూ హసన్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారి నానాటికి ఉదృత రూపం దాల్చుతుందని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో 200 డ్రోన్ లతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్లోని జీడి గోయెంకా పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
- Advertisement -