- Advertisement -
ఇంటర్ విద్యాశాఖను ముట్టడించిన జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు
Candidates for Junior Lecturers who have besieged the Inter Education Department
హైదరాబాద్
జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు ఇంటర్ విద్యాశాఖను ముట్టడించారు. ఎంపికైన జూనియర్ లెక్చరర్స్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని జూనియర్ లెక్చరర్ల అభ్యర్థులు
ఆందోళన చేపట్టారు. 2008 తరువాత 2022 లో జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. 14సంవత్సరాల తరువాత వచ్చిన జెఎల్ నోటిఫికేషన్ 2023లో పరీక్షలు నిర్వహించారు. 2024లో జులై లో టిజిపిఎస్ ఫలితాలు ప్రకటించింది. ఫలితాలు ప్రకటించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు పంపడం జరిగింది. 2025 జనవరి6 న ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తామని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కానీ 6న జరగవలసిన కౌన్సిలింగ్ ను నిలిపివేస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. దీం తో 17సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలపై నీళ్లు చాలడంతో అభ్యర్థులు మండిపడ్డారు. ప్రజాపాలనలో ఎవరికి అన్యాయం చేయం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి లోపు 1392మంది నూతన జూనియర్ లెక్చరర్ లకు నియమకాపాత్రలు అందజేసి విధుల్లోకి చేర్చగుకోవలని డిమాండ్ చేసారు.
- Advertisement -