5వ తరగతి విద్యార్థులపై బెత్తం దెబ్బలు.. టీచర్ సస్పెన్షన్

- Advertisement -

5వ తరగతి విద్యార్థులపై బెత్తం దెబ్బలు.. టీచర్ సస్పెన్షన్

Caning of 5th-grade students… Teacher suspended.

వరంగల్ జిల్లా, నెక్కొండ, అక్టోబర్ 07 (వాయిస్ టుడే): తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు)లో 5వ తరగతి విద్యార్థులపై ఇంగ్లీష్ టీచర్ బెత్తంతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.

విద్యార్థులను ఉపాధ్యాయురాలు రజిని బెత్తంతో కొట్టినట్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద సుమోటోగా స్పందించారు. ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టేందుకు ఎంపీడీవోను నియమించారు.

ఎంపీడీవో విచారణ అనంతరం సమర్పించిన నివేదిక ఆధారంగా ఇంగ్లీష్ టీచర్ రజినిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులపై ఎలాంటి వేధింపులు, శారీరక దాడులను సహించేది లేదని కలెక్టర్ సత్యశారద స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, భయరహిత వాతావరణం కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular