- Advertisement -
ఎంపి అవినాష్ రెడ్డి అనుచరుల ఆధీనంలోని కార్లు స్వాధీనం
Cars owned by MP Avinash Reddy's followers seized
సంగారెడ్డి
ఎంపి అవినాష్ రెడ్డి అనుచరుల ఆధీనంలో ఉన్న కార్లను సంగారెడ్డి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2020లో సంగారెడ్డి లోని హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ వద్ద ఆరు కార్లను వికారాబాద్కు చెందిన మణిరాజ్ అద్దెకు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత మణిరాజ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ ఆరు కార్లు పులివెందులలో ప్రత్యక్షం అయ్యాయి. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఈ కార్లను వాడుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కార్ల అదృశ్యంపై సతీష్ ఫిర్యాదు చేసాడు. మూడు సంవత్సరాలుగా సమస్య కొలిక్కిరాలేదు. చివరకు సతీష్ తనకు న్యాయం చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. స్పందించిన ఎపి ప్రభుత్వం పులివెందుల పోలీసుల ద్వారా సంగారెడ్డి పోలీసులకు కార్లను అప్పగించింది. శుక్రవారం రాత్రి ఆరు కార్లను స్వాధీనం చేసుకుని సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు కార్లను తరలించారు.
- Advertisement -