Thursday, April 24, 2025

యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర

- Advertisement -

యువరైతుల పెళ్లి కోసం బండి యాత్ర

Cart trip for marriage of young people

అనంతపురం, నవంబర్ 25, (వాయిస్ టుడే)
స్వలాభం కోసమో… పార్టీల మైలేజ్ కోసమో… రాజకీయ నాయకులు చేసే పాదయాత్రలు.. బస్సు యాత్రలు ఇప్పటివరకు మనం చూసాం… కొందరుతమ అభిమాన తారలను కలిసేందుకు చేసే సైకిల్ యాత్ర… బైక్ యాత్రలు కూడా చూశాం. కానీ ఎద్దుల బండిపై యాత్ర మీరు ఎప్పుడైనా చూసారా… శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన యువ రైతు నవీన్ ఎద్దుల బండిపై యాత్ర చేపట్టాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు యువరైతు నవీన్ హిందూపురం నుంచి అమరావతికి ఎద్దుల బండిపై యాత్ర మొదలుపెట్టాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు… మహిళలపై జరుగుతున్న అకృత్యాలు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించేందుకు యాత్ర చేపడుతున్నట్లు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యమైనది… వ్యవసాయాన్ని నమ్ముకున్న యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని… పెళ్లిళ్లు కావడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను అంటున్నాడు నవీన్. యువ రైతులకు పెళ్లిళ్లు కావాలంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని… ఈ అన్ని వివరాలు సమగ్రంగా పవన్ కళ్యాణ్‌కు వివరించేందుకు ఎద్దుల బండి యాత్ర చేపట్టినట్లు  నవీన్ వెల్లడించాడు.మొత్తం నెలరోజుల పాటు సాగే ఎద్దుల బండి యాత్రలో… రోజుకు 15 నుంచి 20 కిలోమీటర్లు యాత్ర చేపట్టి నెల రోజుల్లో అమరావతిలోని పవన్ కళ్యాణ్‌ను కలుస్తాను అంటున్నాడు. ఎద్దుల బండిలో తన తిండికి కావలసిన పదార్థాలు, సామాన్లతో పాటు… దారిపొడవున వెళ్లే చోట ఎద్దుల కోసం రైతులను అడిగి పశుగ్రాసం తీసుకుంటున్నట్లు యువ రైతు నవీన్ చెబుతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా నేటి యువతకు, సమాజానికి సందేశాన్ని అందించే విధంగా ఎద్దుల బండి చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రైతుల సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఎద్దుల బండి యాత్ర చేస్తున్నానని చెప్పడం వరకు బాగానే ఉంది…. యువ రైతులకు పిల్లనిచ్చే వాళ్ళు లేరని… పెళ్లిళ్లు కావడం లేదని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాననడంతో… వ్యవసాయం చేస్తున్న పెళ్లికాని ప్రసాదులకు యువ రైతు నవీన్ ఓ టార్చ్ బ్యారర్‌లా కనిపిస్తున్నాడట

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్