పరవాడలో వీధి కుక్కలు పట్టివేత
పరవాడ
Catching stray dogs
అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ పరవాడ గ్రామ పరిధిలో ఈ.ఓ.ఆర్.డి ఆదేశాల ప్రకారం గ్రామంలో వీధి కుక్కలను పట్టివేత కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభించినట్లు పంచాయతీ కార్యదర్శి అచ్చుతరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండడంతో ,ఈ విషయంపై గ్రామ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని, గ్రామస్తులు సహకారంతో సత్వర చర్యలు చేపట్టామన్నారు. గ్రామంలో రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న విధి కుక్కలు ప్రమాదకరంగా మారాయి అన్నారు., కుక్కలు విచ్చలవిడిగా రోడ్లమీద , పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విధి కుక్కలను బుధవారం నాడు పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పట్టుకున్న కుక్కల్ని విశాఖపట్నంలో గల మారికవలస వద్ద ఉన్న శునకముల కూ.ని. ఫ్యామిలీ ప్లానింగ్.(స్టెయిలైజేషన్) శాస్త్ర విభాగమునకు తరలించడం అయినది తెలిపారు. ప్రజలు పినపం మేరకే విశాఖ నుండి ప్రత్యేక సిబ్బందిని తెప్పించినట్లు తెలిపారు. గ్రామంలో 30 కుక్కలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పరవాడ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.