4.1 C
New York
Thursday, February 22, 2024

‘తిరగబడరసామీ’ నుంచి సెలబ్రేషన్ సాంగ్ విడుదల

- Advertisement -

రాజ్ తరుణ్, ఎ ఎస్ రవికుమార్ చౌదరి, సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘తిరగబడరసామీ’ నుంచి సెలబ్రేషన్ సాంగ్ విడుదల

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రం నుంచి సెలబ్రేషన్ సాంగ్ ని విడుదల చేశారు. కంపోజర్ జేబీ ఈ పాటని పర్ఫెక్ట్ సెలబ్రేషన్ నెంబర్  గా కంపోజ్ చేశారు. లిప్సికా భాష్యం, అదితి బావరాజు, చైతు సత్సంగి వీనుల విందుగా అలపించారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో విజువల్స్ కన్నుల పండగలా వున్నాయి.యువతని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. హిందీ బిగ్ బాస్ తో యావత్ భారతాన్ని అలరించిన మనరా చోప్రా ఈ చిత్రంలో ఓ విభన్న పాత్రతో పాటు ప్రత్యేక గీతంతో అలరించబోతుంది.
ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. ఫిబ్రవరి 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: రాజ్ తరుణ్ , మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!