మొదలైన వినాయక ఉత్సవాల సందడి

- Advertisement -

మొదలైన వినాయక ఉత్సవాల సందడి

Celebrations of Ganesha festivals Started

– నేడు వినాయక చవితి
– ఉత్సవాలకు పూర్తయిన ఏర్పాట్లు
– పత్తికొండ మండల వ్యాప్తంగా ముస్తాబైన మండపాలు
– పూలు, పండ్లు, పత్రి కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్లు

పత్తికొండ

వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు  మొదలైన వినాయక ఉత్సవాల సందడి .పత్తికొండ పట్టణంతో పాటు, మండల కేంద్రాలు, గ్రామాల ప్రజలు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.   ఈ నేపథ్యంలో శుక్రవారం ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో మార్కెట్లు కళకళ లాడాయి. వినాయకుడిని పూజించేందుకు అవసర మైన సరుకులు, పూలు, పండ్లు, పత్రిలు, చెరుకు గడలు, మొక్కజొన్న కంకులు కొనేవారితో మార్కెట్‌ సందడిగా మారింది. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలు విక్రయించే కేంద్రాలు జనంతో కిటకిటలాడాయి. ఉత్సవ నిర్వాహకులు భారీ గణపతి విగ్రహాలను కొనుగోలు చేసి ట్రాక్టర్లు, లారీల్లో మండపాలకు తరలించడం కనిపించింది. ఈ సారి ప్రజలు మట్టి వినాయక విగ్రహాల కొనుగోలుపై ఆసక్తి చూపిస్తున్నట్లు విక్రేతలు తెలిపారు
పూలు,
పండ్లు, పత్రి కొనుగోలుదారులతో కిటకిటలాడిన మార్కెట్లు

పత్తికొండ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల విక్రయ కేంద్రాలు శుక్రవారం రద్దీగా మారాయి. పట్టణంలో పలు చోట్ల మండపాలను సిద్ధం చేసి, విద్యుత్‌ దీపాలను అలంకరించారు. పూజ సామగ్రి, మండపాల అలంకర ణ సామగ్రి కొనుగోలు చేయడంలో ఉత్సవ నిర్వాహ కులు బిజీగా కనిపించారు.
ఈసారి పత్తికొండ మండల వ్యాప్తంగా పెద్ద విగ్రహాలు 200 మండపాలు ఉంటాయని అంచనా

వినాయక చవితి పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

పత్తికొండ డివిజన్ డీఎస్పీ వెంకటరామయ్య

పత్తికొండ డివిజన్ లో పట్టణం ,గ్రామాల్లో వినాయక చవితి పండుగలను  ఐకమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని  పత్తికొండ డివిజన్ డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. అనంతరం డీఎస్పీ  మాట్లాడుతూ  వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరుపుకోవాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular