Thursday, January 9, 2025

మీడియా హక్కులు కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

- Advertisement -

మీడియా హక్కులు కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Central and State Governments are curating media rights

– జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం రావాలి

– ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

– బస్తర్ మృతుడు చంద్రకార్ కు నివాళి
, పెద్దపల్లి
మీడియా హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బస్తర్ లో హత్యకు గురైన జర్నలిస్టు చంద్రకార్ కు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో నివాళులర్పించారు. టీయుడబ్ల్యూజె దాడుల నివారణ కమిటీ జిల్లా కన్వీనర్ సీపెల్లి రాజేశం ఆద్వర్యంలో మంగళవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చింతకింది చంద్రమొగిలి, నారాయణదాసు. అశోక్, టియుడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు హక్కుల సాధన సమితి అధ్యక్షులు ముదిమడుగుల మల్లన్న, దళిత లిబరేషన్ ప్రంట్ రాష్ట్ర కన్వీనర్ మార్వాడి సుదర్శన్, రైతు సంఘం నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు ఎరుకల రాజన్న, విరసం ఉమ్మడి జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య, తెలంగాణ పీపుల్స్ జేఏసి నాయకులు పొన్నం రాజమల్లయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మడి కొమురయ్య, కో కన్వీనర్ గాండ్ల మల్లేశం మాట్లాడుతూ  బస్థర్ లో జర్నలిస్టు చంద్రకార్ హత్యను తీవ్రంగా ఖండించారు. చంద్రకార్ హత్యపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు, హత్యలు నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయ పడ్డారు. కార్పొరేట్, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న పాలకులు దోపిడీదారులు అక్రమాలను వెలుగులోకి తీస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడడం ఆటవిక చర్యలని అన్నారు. ప్రజల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్న వారి అక్రమాలను మీడియా వెలుగులోకి తీస్తుంటే తట్టుకోలేని అక్రమార్కులు రాజ్యం ముసుగులో దాడులకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వా మ్యం పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు ప్రజా సంఘాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాజ్యం కుట్రలను తిప్పికొట్టడంలో జర్నలిస్టులు నిర్భయంగా నిజాలను వెలికితీసి ప్రజలకు వివరించాలని సూచించారు. పత్రికా స్వేచ్చను హరించే విధంగా పాలకులు వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాస్వా మ్యంలో ఫోర్త్ ఎస్టేట్ మీడియా హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులదేనని అన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రమొగిలి, అశోక్, దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సీపెళ్ళి రాజేశం, టియుడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు పోగుల విజయ్ కుమార్, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వీరమల్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధనకు సంఘాలకు అతీతంగా కలిసి కట్టుగా పోరాడుదామని అన్నారు. పాలకులు ద్వంద వైఖరి విడనాడి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పై దాడులను అరికట్టేలా ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలని కోరారు. అంతకుముందు ఇటీవల మృతిచెందిన జర్నలిస్టు అమరులకు నివాళులర్పిం చారు. సమావేశంలో జర్నలిస్టు సంఘాల నాయకులు దొమ్మటి రాజేష్, జిలకర రమేష్, మొదుంపల్లి సాగర్, ఈదునూరు జైపాల్, జాపతి సంజీవ్, శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్