కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం లో రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం పరిష్కారం చేయాలి
Central government should solve the crisis faced by farmers in agriculture
46 , రోజుల నుంచి నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జత్ సింగ్ దలైవాల్ కు మద్దతుగా
వైరా లో సంఘీభావ ప్రదర్శన
వైరా
వ్యవసాయ రంగం లో రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం పరిష్కారం చేయాలి అని,రైతులు పండించిన పంటలు కు చట్టబద్ధమైన గిట్టుబాటు ధరలు డిమాండ్ చేస్తూ పంజాబ్ హర్యానా సరిహద్దులో ఖనేరీ లో 46 రోజుల నుంచి నిరవధిక నిరహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జత్ సింగ్ దలైవాల్ కు మద్దతుగా గురువారం వైరా లో సంఘీభావం గా రైతులు ప్రదర్శన నిర్వహించారు. మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మూలం గా వ్యవసాయం చేస్తున్న రైతులు సంక్షోభం లో ఉన్నారు అని అన్నారు,గత ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా నల్ల చట్టాలను రద్దు చేసి చట్టబద్ధమైన గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదు అన్నారు మరోవైపు నూతన వ్యవసాయ మార్కెట్ విధాన పత్రం అమలు చేయాలని ప్రయత్నం చేయడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు నేత జగ్జత్ సింగ్ దలైవాల్ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో,తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు,కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు, దొడ్డపనేని కృష్ణార్జున్ రావు,సంక్రాంతి నర్సయ్య, కురుగుంట్ల శ్రీనివాసరావు ,సంక్రాంతి పురుషోత్తం, మచ్చా కృష్ణ మూర్తి, రుద్రాక్షల నరసింహాచారి, పారుపల్లి శ్రీనాధ్,వడ్లమూడి మధు, యనమద్ది రామకృష్ణ,పాసుంగలపాటి చలపతిరావు, మాడపాటి మల్లిఖార్జున్, వేల్పుల రాములు, అమరనేని కృష్ణ,కొంగర సుధాకర్, పాషా,చిత్తారు లక్ష్మణ్, నూకల వెంకటేశ్వరరావు,దెవభక్తిని వెంకటేశ్వరరావు,దొసపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు