- Advertisement -
ఛైర్మన్ డా. డి నాగేశ్వర్ రెడ్డిని సన్మానించిన మంత్రి కోమటిరెడ్డి
Chairman Dr. Minister Komati Reddy honored D Nageshwar Reddy
హైదరాబాద్
పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న ఎషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ ఛైర్మన్ డా. డి నాగేశ్వర్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్మానించారు.
మంత్రి మాట్లాడుతూ వైద్యరంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి ని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించడం తెలుగు వారందరికి గర్వకారణం. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో వారు చేసినంత పరిశోధనలు, ఆవిష్కరణలు మరో డాక్టర్ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు.. అయన స్వయంగా పరిశోధించి ఆవిష్కరించిన ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్స్ సరిదిద్దే నాగి స్టెంట్ ఇవ్వాల ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ప్రాణం పోస్తున్నది. షుగర్ వ్యాధిగ్రస్తులను సైతం తన పరిశోధనలతో పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి గొప్పతనం మాటల్లోనే చెప్పుకునేది కాదు. ప్రపంచంలో నెంబర్ -1 గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ గా మన తెలంగాణ గడ్డమీద నుంచి సేవలందించడం మన అదృష్టం. ప్రపంచంలో ఏ డాక్టర్ కు సాధ్యం కానీ విధంగా 5 ఎఎస్ జీఈ (ASGE) (అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఎండోస్కోపీ) క్రిస్టల్ అవార్డులు పొందిన ఏకైక ఎండోస్కోపిస్ట్ మన నాగేశ్వర్ రెడ్డి అని కొనియాడారు.
- Advertisement -



