- Advertisement -
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తి
Chakali Ailamma who fought against tyrannical rule Nizam is inspiration
జయశంకర్ భూపాలపల్లి,
, సెప్టెంబర్ 10
భూపాలపల్లిలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ భావితరాలకు స్ఫూర్తి అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగాగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం భూపాలపల్లి ఐడిఓసి సమావేశపు హాలలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అందరికీ ఆదర్శనీయురాలని కొనియాడారు. ఐలమ్మ ఆనాడు చేసిన ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిందని, ఆ తర్వాత మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ ఆనాటి దేశ్ ముఖ్ లు, రజాకార్ల గుండెల్లో దడపుట్టించాయని అన్నారు. ఒకవైపు సాయిధ పోరాటం చేస్తూనే, మరోవైపు ఉద్యమకారులకు అన్నం పెట్టిన మహనీయురాలు అని అన్నారు. జిల్లా కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జయంతి వేడుకల వరకు పూర్తి చేసి ఆవిష్కరణ చేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ తెలంగాణ తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత (చిట్యాల)చాకలి ఐలమ్మ అన్నారు. తొలితరం భూ పోరాట ఉద్యమ నాయకురాలు చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్థి ప్రధాత అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకి చెందిన చాకలి ఐలమ్మ ( చిట్యాల ఐలమ్మ) దొరల పెత్తనాన్ని ఎదిరించి, రజాకార్లను తరిమికొట్టిన వీరవనితగా పేరు తెచ్చుకున్నారని తెలిపార. నేటితరం చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి శైలజ, ఇతర శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



