Sunday, September 8, 2024

చందా దేవో… దందా ఖరో మోడీ సర్కార్ నినాదంగా మారింది

- Advertisement -

చందా దేవో… దందా ఖరో మోడీ సర్కార్ నినాదంగా మారింది
ఎఐసిసి ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే చురకలు
న్యూ ఢిల్లీ జూలై 1
: ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పుడు పొత్తులను అపహాస్యం చేశారని, ఇప్పుడు అదే పొత్తులపైనే ఆధారపడ్డారని ఎఐసిసి ప్రెసిడెంట్, ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే చురకలంటించారు. రాజ్యసభలో ప్రెసిడెంట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడారు. మోడీ సినిమాలో అన్ని లీకేజీలే ఉన్నాయని, నీట్ యూజీ లీక్ చేశారని, నీట్ పిజి రద్దు చేశారని, అయోద్య రామాలయం పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అయ్యిందని దుయ్యబట్టారు. ఏటా 20 లక్షల ఉద్యోగాల మాట హామీ ఏమైందని, మోడీ ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పడంతో పాటు కుల, మత, భాషా పరంగా ప్రజలను రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు.మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు 200కు పైగా ప్రసంగాలు ఇచ్చారని, మోడీ 117 ఎన్నికల ప్రచార సభలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కానీ ఇసి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు విపక్షాల అకౌంట్లు ప్రీజ్ చేశారని, విపక్షాల ప్రచారాన్ని ఎన్నో రకాలుగా అడ్డుకున్నారని, విపక్షాలను అణగదొక్కడం మోడీకి అలవాటుగా మారిందని ఖర్గే మండిపడ్డారు. చందా దేవో… దందా ఖరో మోడీ సర్కార్ నినాదంగా మారిందని, ఇడి, సిబిఐ, ఐటిని ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వాడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వాలు పడగొట్టడం నేతలను కొనడం కామన్‌గా మారిందని, ప్రభుత్వాలను పడగొట్టడం ప్రజాస్వామ్యానికి అవమానం కాదా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, గోవా, మణిపూర్‌లలో ప్రభుత్వాలను పడగొట్టారని, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని, కేజ్రీవాల్‌కు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేశారని, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్