Wednesday, February 19, 2025

ఢిల్లీ ప్రచారానికి చంద్రబాబు, పవన్

- Advertisement -

ఢిల్లీ ప్రచారానికి చంద్రబాబు, పవన్

Chandrababu and Pawan campaign for Delhi

విజయవాడ జనవరి 30, (వాయిస్ టుడే)
భారతీయ జనతా పార్టీ.. పలు రాష్ట్రాల్లో అవలంభించిన గెలుపు ఫార్మూలాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్‌తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తోంది బీజేపీ అధిష్ఠానం.. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితాలు మోదీకి ఎంతో శక్తినిచ్చాయి. విడిపోతే అంతర్ధానమైపోతాం.. ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం అనే నినాదాలతో పాటు బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల సమస్యను బలంగా లేవనెత్తారు. వీటితో పాటు ఏపీలో కూటమి నేతల ప్రచారం బాగా కలిసొచ్చింది. ఇలా అన్నీ కలిసి మహాయుతి కూటమికి తిరుగులేని విజయాన్నందించాయి. ఎన్డీఏ సంఖ్యా బలంలో కీలకంగా టీడీపీ, జనసేన.. వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్డీఏ గెలుపు కోసం తమవంతు పాత్రను పోషిస్తున్నాయి. మరఠ్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ అధిష్ఠానం ప్రచారం చేయించింది. మొత్తం ఐదు బహిరంగ సభలు.. రెండు రోడ్‌ షోలకి ప్లాన్ చేసింది. తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పవన్‌తో ప్రచారం చేయించి ఓట్లను రాబట్టుకోవడంలో సక్సెస్ అయింది. సీఎం చంద్రబాబు ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా ఆఖరి నిమిషంలో మహారాష్ట్ర పర్యటన రద్దు రద్దయింది.ఏపీలో కూటమి నేతలు మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లడం.. అక్కడ విజయం సాధించడాన్ని బీజేపీ సెంటిమెంట్‌గా భావిస్తోంది. ఇప్పుడదే సెంటిమెంట్‌ను ఢిల్లీలోనూ ప్రయోగించాలనుకుంటోంది. హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబును ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో దింపబోతుంది. ఫిబ్రవరి 1న ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు చంద్రబాబు. తెలుగువాళ్లు నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయబోతున్నారు.అలాగే పవన్ కల్యాణ్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. బహిరంగ సభలు, రోడ్‌ షోలు ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది. కూటమి నేతల ప్రచారం మహారాష్ట్రలో వర్కవుట్ అయినట్టే ఢిల్లీలోనూ కలిసొస్తుందని బీజేపీ అధిష్ఠానం లెక్కలేసుకుంటోంది.ఢిల్లీలో ఆప్‌ వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అటు బీజేపీ మాత్రం ఆప్ విజయాలకు బ్రేక్ వేసి హస్తినలో కాషాయ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను రంగంలోకి దింపాలని భావిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్