Monday, March 24, 2025

చంద్రబాబు ఇలా… జగన్ అలా

- Advertisement -

చంద్రబాబు ఇలా… జగన్ అలా
తిరుపతి, మార్చి 8, (వాయిస్ టుడే)

Chandrababu like this... Jagan like that

ఏపీ సీఎం చంద్రబాబుపై అనేక రకాల విమర్శలు ఉండేవి. ఆయన కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వరని… బంధుత్వాలను పక్కన పెడతారని.. అలా చేస్తే మరో రాజకీయ కేంద్రంగా మారుతారని భావిస్తారని.. ఇలా ఎన్నెన్నో ప్రచారాలు ఉండేవి. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి ఎదిగారని కూడా ఆరోపణలు ఉండేవి. అయితే క్రమేపీ ఆరోపణలన్నీ కరిగిపోతున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. తాజాగా తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆత్మీయ ఆలింగనం చేసుకుని దగ్గర చేర్చుకున్నారు చంద్రబాబు. తెలుగు నాట ఈ ఇద్దరు తోడల్లుళ్లు మధ్య జరిగిన పొలిటికల్ ఫైట్ అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబును విభేదించే దగ్గుబాటి తనకు తానుగా దగ్గరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.టిడిపిసంక్షోభ సమయంలో చంద్రబాబుతో పాటు దగ్గుబాటి కలిసి ఉండేవారు. చంద్రబాబు సీఎంగా, వెంకటేశ్వరరావు మంత్రిగా ఉండేవారు. కార్యక్రమంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వెంకటేశ్వరరావు చంద్రబాబు అంటేనే మండిపడే వారని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి వెంకటేశ్వరరావు అదే చంద్రబాబును ఆశ్రయించారు. తమ మధ్య గ్యాప్ ఉండేదని చెప్పుకున్నారు. కానీ కుటుంబం అంటే కలిసిపోవాలి కదా అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అటు దగ్గుబాటి పురందేశ్వరి సైతం తన చెల్లెలి భర్త విషయంలో గౌరవంగానే ఉంటున్నారు.
ఆది నుంచి నందమూరి కుటుంబం చంద్రబాబు పట్ల గౌరవభావంతోనే ఉంది. టిడిపిలో సంక్షోభ సమయంలో చంద్రబాబు చేసిన పనికి వెన్నుపోటు అన్నారు. కానీ ఉమ్మడి ఏపీ ప్రజలు ఆశీర్వదించారు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలు సైతం నమ్మకం పెట్టుకున్నారు. అదే సమయంలో నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ బతికున్నంత వరకు బావ చంద్రబాబు తోనే కొనసాగారు. మధ్యలో విభేదించి వెళ్లిపోయిన హరికృష్ణ ను చేరదీసి రాజ్యసభ పదవి ఇచ్చారు. బాలకృష్ణ ద్వారా నందమూరి కుటుంబాన్ని ఐక్యం చేసి తన వైపు తిప్పుకోగలిగారు. దశాబ్దాలుగా వైరంతో ఉన్న తోడల్లుడు దగ్గుబాటి కుటుంబాన్ని సైతం చేరదీయగలిగారు.అయితే చంద్రబాబు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేరదీయగలరా? అనే ప్రశ్న వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదించారు సోదరి షర్మిల. ముందుగా వ్యక్తిగతంగా సోదరుడికి దూరమయ్యారు. తరువాత రాజకీయంగా రూటు మార్చారు. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీశారు. మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదిస్తున్నారు. తన తండ్రి హత్య విషయంలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ.. కుమారుడు కంటే కుమార్తెకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు మాదిరిగా ఇంట గెలిచే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు. దానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి ఉంది.
షర్మిల ట్రాప్ లో విజయమ్మ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివాదం పెను ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కుమార్తె షర్మిల వైపు విజయమ్మ నిలిచారు. ఇటీవల సరస్వతి పవర్ వాటాల విషయంలో స్పష్టత ఇచ్చారు. జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై తాజాగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి. తన తల్లి, సోదరి షర్మిల తో ఆస్తుల వివాదంపై అనేక విషయాలను బయటపెట్టారు. ఇంతటి వివాదానికి కారణం షర్మిల అని వ్యాఖ్యానించారు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయని వివరించారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే.. గిఫ్ట్ డీడ్ లను అడ్డుపెట్టుకొని షర్మిల కాజేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. అందుకే షర్మిలపై ఒకప్పటి ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవని చెప్పుకొచ్చారు జగన్.
కొద్దిరోజులుగా సరస్వతీ పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఎన్సిఎల్టిలో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వాటాల విషయంలో తల్లి విజయమ్మను ముందు ఉంచి షర్మిల వెనుక వ్యవహారం మొత్తం నడిపిస్తోందని చెప్పుకొచ్చారు. షర్మిల తన పంతం నెగ్గించుకోవడానికి అక్రమ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వాటాల వివాదంలో తల్లి విజయమ్మ ఆవేదనను అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. తన తల్లి పై గౌరవం ఉందని.. కానీ ఆమె వెనుక ఉండి చెల్లి చేయిస్తున్న అక్రమాలు అడ్డుకోవడానికి పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.షర్మిల తీరు తో తనకు చాలా నష్టం జరిగిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత రాజకీయ, విభేదాలతో తల్లిని అడ్డం పెట్టుకుని వాటాలను బదలాయించడం వల్ల తనకు నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉందని.. చేయి దాటకుండా ఉండేందుకు తనతో పాటు భారతి అమ్మ విజయమ్మ ద్వారా ప్రయత్నాలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కానీ అవేవీ ఫలించలేదని చెప్పుకొచ్చారు. అందుకే కోర్టుకు ఆశ్రయించవలసి వచ్చిందని చెప్పారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో భాగస్వామ్యం కాలేదని వివరించారు.తన తల్లి విజయమ్మను షర్మిల బలి పశువు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. మా వాటాలను అక్రమంగా లాక్కోవడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారని అఫిడవిట్ లో పేర్కొన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు.. సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రిబ్యునల్ కు ఉంటుందని ఆ పిటిషన్ లో స్పష్టం చేశారు.ఒక పథకం ప్రకారం తన తల్లి విజయమ్మను షర్మిల తెరపైకి తెచ్చారని జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని… వాటాల సర్టిఫికెట్లను తల్లి విజయమ్మకు అందజేయలేదని చెప్పారు. చెల్లితో ఉన్న వ్యక్తిగత, రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవమని జగన్ పేర్కొన్నారు. కేవలం న్యాయబద్ధంగా తమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికైతే తన తల్లి ద్వారా షర్మిల బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు జగన్. మరి వారి వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్