29.6 C
New York
Wednesday, June 19, 2024

నాపై రాళ్లు వేయండని చంద్రబాబు చెబుతున్నాడు..

- Advertisement -

చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు నా పై కోపం ఎక్కువగా వస్తోంది.

హై బీపీ వస్తోంది. ఏవేవో తిడుతూ ఉంటాడు. శాపనార్థాలు పెడుతుంటాడు. నాకేదో అయిపోవాలని కోరుకుంటాడు. రాళ్లు వేయండి, అంతం చేయండి అని పిలుపునిస్తూ ఉంటాడు. బాబుకు ఓటు వేస్తే.. పథకాలన్నీ ఆగిపోతాయి.

చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. దత్త పుత్రుడు ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేశాడు. రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి నాశనం చేయాలని చూస్తుందన్నారు. చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా.. చెరువులో కొంగ మాదిరిగా ఎదురుచూస్తూ..ఇంకో పక్క కొంగ మాదిరిగా జపం చేస్తావ్ ఎందుకు అయ్యా అడిగాను. ఇలా అడగడం తప్పా..? చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే స్కీమ్ ఒక్కటైనా ఉందా..? అని అడిగానని భీమవరం సభలో పేర్కొన్నారు సీఎం జగన్.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!