- Advertisement -
చంద్రబాబు వర్సెస్ జగన్
Chandrababu vs. Jagan
విజయవాడ, జనవరి 29, (వాయిస్ టుడే)
రాష్ట్ర ప్రభుత్వం పై ముప్పేట విమర్శలు ప్రారంభమయ్యాయి. సంక్షేమ పథకాలు అమలు చేయలేమన్న చంద్రబాబు ప్రకటన ప్రకంపనలు రేపుతోంది.ఏపీలో చంద్రబాబు సర్కార్ పై తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే అది ప్రజల నుంచి నేరుగా కాదు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చాలామంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు చేయడం ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే..’ సంపద సృష్టి లేదు.. సంపంగి పువ్వు లేదు’ అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. మరోవైపు టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తల్లికి వందనం కాదు.. తద్దినం పెట్టేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ చంద్రబాబును తగులుకున్నారు. అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబుకు పరిపాటేనని చెప్పుకొచ్చారు. సంపూర్ణ రైతు రుణమాఫీ అనే ఒకే ఒక్క కారణంతో 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అటు తరువాత దానిని ఎలా ఎగ్గొట్టాడో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించలేకపోయారని.. విశాఖ ఉక్కును కాపాడలేకపోయారని ధ్వజమెత్తారు. అందుకే 2019లో ప్రజలు చంద్రబాబును అతి దారుణంగా ఓడించారని పేర్కొన్నారు. ఓడిపోయిన చంద్రబాబు ఖాళీ బడ్జెట్ తో పాటు ఖాళీ ఖజానాను అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అప్పగించలేదా అని ప్రశ్నించారు.రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు హర్ష కుమార్. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకు అమలు చేస్తూనే ఉన్నారని.. తొలిసారి సీఎం అయినా గానీ.. ఖజానా ఖాళీగా ఉన్నా గానీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని జగన్ అమలు చేసి చూపించారని హర్షకుమార్ చెప్పుకొచ్చారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని పేరు చెప్పుకునే చంద్రబాబు.. సంక్షేమ పథకాలను అమలు చేయలేనంటూ చేతులెత్తేయడం తగునా అంటూ నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరా? లేక జగన్ మంచి అడ్మినిస్ట్రేటరా? అంటూ ప్రశ్నించారు జీవీ హర్ష కుమార్.
అయితే ఒకేసారి హర్ష కుమార్ చంద్రబాబు పై విరుచుకు పడడం విశేషం. చంద్రబాబు ఒక స్ట్రాటజీ ప్రకారం సంక్షేమ పథకాల విషయంలో అమలు చేశారని తెలుస్తోంది. కానీ తటస్థంగా ఉండే నాయకులు సైతం ఇప్పుడు ముందుకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేస్తుండడం విశేషం. రాష్ట్ర విభజన తర్వాత హర్షకుమార్ సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇటీవల జగన్ కు సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా ప్రచారం నడిచింది. కానీ ఆయనను అప్పట్లో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు జగన్ కు జీవి హర్ష కుమార్ దగ్గరవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో హర్ష కుమార్ చంద్రబాబు పై హాట్ కామెంట్స్ చేయడం విశేషం.
- Advertisement -