- Advertisement -
ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని చంద్రబాబు మోసాలు
Chandrababu's scams are coming out one by one
ఎపి మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి
అమరావతి జనవరి 4
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే మోసాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని ఎపి మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. తల్లికి వందనం పథకం అమలు చేస్తామని చెప్పి బాబు మోసం చేశారని మండిపడ్డారు. శనివారం జగన్ మీడియాతో మాట్లాడారు. వాగ్దానాలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తాము ఇచ్చే అమ్మ ఒడి పథకాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆపేసిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ. 15 వేలు చొప్పున ఇస్తామన్నారని. కానీ ఇప్పటివరకు ఈ పథకాన్ని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ ఏడాది కూడా పథకాలు అమలు చేయకపోవడంతో కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ విమర్శలు గుప్పించా
- Advertisement -