చంద్రమోహన్ ఇకలేరు

- Advertisement -
chandramohan-can-no-longer
chandramohan-can-no-longer

సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు..

ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి..

టాలీవుడ్ లో  తీవ్ర విషాదం

హైదరాబాద్: టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన ఆయన.. 1966లో రంగులరాట్నం సినిమాతో తెరంగేట్రం చేశారు. మొత్తం 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.  చంద్రమోహన్ తో మొదటి చిత్రం చేసిన తారలు స్టార్లు అవుతారని అందరూ అంటుంటారు. జయసుధ, జయప్రద మొదలు సుహాసిని వరకు అందరూ తొలినాళ్లలో ఆయన పక్కన నటించారు.చినవారే. ఎన్నో విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రజల మనసులో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. సోమవారం హైదరాబాద్లో అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular