- Advertisement -
ఇక ఏపీలో ప్రైమరీ స్కూల్స్ లో మార్పులు
Changes in primary schools in APవిజయవాడ, నవంబర్ 18, (వాయిస్ టుడే)
ఏపీలో ఇకపై రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా స్కూళ్ల టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రెండు రకాల ప్రాథమిక పాఠశాలలు నడపాలని నిర్ణయించింది. అలాగే స్కూల్ టైమింగ్స్ మార్పుపై కూడా నిర్ణయిం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
రెండు రకాలుగా ప్రాథమిక పాఠశాలలు
1. బేసిక్ ప్రైమరీ స్కూల్
2. మోడల్ ప్రైమరీ స్కూల్
1. బేసిక్ ప్రైమరీ స్కూల్
బేసిక్ ప్రైమరీ స్కూల్స్‌లో పీపీ-1, పీపీ-2తో బాటు 1, 2 తరగతులు ఉంటాయి. సోషల్ బ్యారియర్స్, నేచురల్ బ్యారియర్స్ ఉన్న చోట పీపీ-1, పీపీ-2తో బాటు 1 నుండి 5 తరగతులు కూడా నిర్వహించబడతాయి. 20 లోపు విద్యార్ధులకు ఒక ఎస్జీటీ, 21 నుండి 60 లోపు విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు, ఆపై ప్రతి 30 మందికి ఒక ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉంటారు.
2. మోడల్ ప్రైమరీ స్కూల్
ప్రతి రెవెన్యూ గ్రామ పంచాయితీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల సంఖ్య 100, అంతకంటే ఎక్కువ ఉంటే ప్రతి తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తారు. 120 రోల్ దాటిన ప్రతి స్కూల్‌కు ఒక ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడిని కేటాయిస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి మోడల్ ప్రైమరీ స్కూల్స్‌ను పునః ప్రారంభిస్తారు. ముందుగా 70, 80 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆ ప్రైమరీ స్కూల్‌ను మోడల్ ప్రైమరీ స్కూల్‌గా గుర్తిస్తారు. ఐదు తరగతులకు ఐదుగురు టీచర్లను ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2, 3 ఏళ్ళలో 9 వేల నుండి 10 వేల పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూల్స్‌గా మార్చడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.
1. ప్రాథమికోన్నత పాఠశాలలు
6,7,8 తరగతుల విద్యార్థులు 60 కంటే తక్కువ ఉంటే ఆ పాఠశాలను ప్రాథమిక పాఠశాలగా తగ్గించాలని, 60 కంటే ఎక్కువ ఉంటే దానిని ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తోంది. 6,7,8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30 లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను ప్రాథమిక పాఠశాలలుగా తగ్గిస్తారు. విద్యార్ధుల సంఖ్య 31 నుండి 59 లోపు ఉండి గిరిజన ప్రాంతాలు, తండాలు, కాలనీలలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు సమీప హైస్కూల్ 5 కిలో మీటర్ల పైబడి దూరం ఉన్నట్లయితే వాటిని అప్పర్ ప్రైమరీ (యూపీ) స్కూల్స్‌గా కొనసాగిస్తారు.
- Advertisement -




