- Advertisement -
సర్వదర్శనం టోకెన్ల జారీ విధానంలో మార్పులు
Changes in Sarvadarshan Tokens Issuance Procedure
తిరుమల
వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ విధానంలో మార్పులు చేసారు. జనవరి 9న ఉదయం 5 గంటలకు టీటీడీ ఆఫ్లైన్లో టోకెన్లు జారీ చేయనుంది. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వారదర్శనం వుంటుంది. రోజుకి 40 వేల చొప్పున సర్వదర్శనం భక్తులకు టోకెన్లు జారీ చేస్తారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి 1 లక్షా 20 వేల టోకెన్లు ఇవ్వనుంది. మిగిలిన రోజులకు సంబంధించి ముందు రోజు రెగ్యులర్ కౌంటర్ల ద్వారా టోకెన్లు కేటాయింపులుంటాయి. తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రాలలో 91 కౌంటర్లలో టోకెన్లు జారీ చేస్తారు.
- Advertisement -