3.5 C
New York
Monday, February 26, 2024

కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్ర  షెడ్యూల్ లో మార్పులు 

- Advertisement -

హైదరాబాద్:అక్టోబర్ :  ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్‌ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నది.

నూతన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొననున్నారు. 27న పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేటల్లో సీఎం కేసీఆర్‌ సభలు జరుగనున్నాయి. మిగతా సభలు యథావిధిగా జరుగనున్నాయి.

ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 26వ తేదీన అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో సభలు జరగాల్సి ఉంది. కానీ నాగర్‌కర్నూలులో జరగాల్సిన సభను వనపర్తికి మార్చారు.

ఇక 27వ తేదీన పాలేరు, స్టేషన్‌ఘన్‌పూర్‌లో పర్యటించాల్సి ఉండగా.. కొత్త షెడ్యూల్‌ ప్రకారం పాలేరు, మహబూబాబాద్‌, వర్దన్నపేటకు సభలను మార్చారు.

సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌

అక్టోబర్‌ 29 కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్‌ 30 జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌

అక్టోబర్‌ 31 హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్‌ 01 సత్తుపల్లి, ఇల్లెందు

నవంబర్‌ 02 నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

నవంబర్‌ 03 భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల

నవంబర్‌ 05 కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్‌ 06 గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట

నవంబర్‌ 07 చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్‌ 08 సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

నవంబర్‌ 9న గజ్వేల్ కామారెడ్డి నియోజకవర్గ లలో ఒకేరోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేస్తారు.

ఆనవాయితీ ప్రకారం 9న ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం గజ్వేల్‌లో మొదటి నామినేషన్‌, మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండో నామినేషన్‌ దాఖలు చేస్తారు. 4 గంటలకు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు…

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!