20 C
New York
Tuesday, May 28, 2024

చేవెళ్ల ఎంపీ బరిలో పొలిమేర 2 నటి

- Advertisement -

చేవెళ్ల ఎంపీ బరిలో పొలిమేర 2 నటి
హైదరాబాద్, ఏప్రిల్ 24
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జోరు, హోరు మొదలైంది. ముఖ్యంగా ఏపీలోని అసెంబ్లీ ఎన్నికల్లో అగ్ర హీరోలు పోటీ చేస్తున్నారు. వారితో పాటు ఆయా పార్టీలకు మద్దతుగా ప్రచారంలో కొందరు సినిమా స్టార్లు పాల్గొంటున్నారు. పిఠాపురం నియోజవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. హిందూపూర్ నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మరోసారి బరిలో నిలిచారు. వైసీపీ నుంచి నగరి నియోజకవర్గంలో సీనియర్ హీరోయిన్, నటి రోజా సెల్వమణి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో ఆ స్థాయిలో సినిమా తారల సందడి లేదు. ఓ నటి వేసిన నామినేషన్ మాత్రం ఆసక్తి కలిగించేలా ఉంది. మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’ సినిమాలు చూశారా? అందులో ‘గెటప్’ శ్రీను వైఫ్ రోల్ చేసిన నటి గుర్తు ఉన్నారా? ఆమె పేరు సాహితీ దాసరి. తెలంగాణ నుంచి ఎంపీ ఎన్నికలకు పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాలో ఆమె ఉన్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. ఎన్నికల అధికారిని కలిసిన సాహితీ దాసరి… స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు సుమారు ఐదు లక్షలుగా చూపించారు. తన వయసు 29 ఏళ్లు అని, తనకు ఇంకా పెళ్లి కాలేదని అఫిడివిట్‌లో పేర్కొన్నారు.’మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’తో పాటు నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు హీరోగా పరిచయమైన ‘సర్కారు నౌకరి’, ఇంకా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాల్లో సాహితీ దాసరి నటించారు. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!