కేవలం
రెండు రూపాయలకే చికెన్ బిర్యాని – ట్రాఫిక్ జామ్
Chicken biryani for two rupees – traffic jam
తాడేపల్లిగూడెం
స్థానిక ఉషా గ్రాండ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన అన్ లిమిటెడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా కేవలం రెండు రూపాయలకే చికెన్ బిర్యాని ఏర్పాటు చేశారు .
కంగారు పడకండి చిన్న చిన్న పొట్లాలు .
నిర్వాహకులు 200 మంది కోసం ఏర్పాటు చేస్తే రెండు వేల మంది వచ్చారు .
ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ హోటల్ ప్రారంభోత్సవానికి రావడంతో హోటల్ యజమాని మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు ఈ పథకం ప్రవేశపెట్టాడు
దీంతో తొక్కిసలాట, ట్రాఫిక్ జామ్, టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు .
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జి), మున్సిపల్ మాజీ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు .



