Sunday, September 8, 2024

హైదరాబాద్ లో కొండెక్కిన చికెన్ ధరలు

- Advertisement -

హైదరాబాద్ లో కొండెక్కిన చికెన్ ధరలు
హైదరాబాద్ , మే 22 (వాయిస్ టుడే)
తెలుగు రాష్ట్రాల్లో మాంసప్రియులకు బ్యాడ్ న్యూస్. ఏపీ, తెలంగాణలో చికెన్, మటన్ ధరలు కొండెక్కాయి. గత వారం వరకూ రూ.200 ఉన్న కిలో చికెన్… రూ.300లకు చేరుకుంది. ఎండలు ఎక్కువగా ఉండడం, కోళ్ల దాణా ధరలు పెరగడంతో ఉత్పత్తి తగ్గిందని ఫౌల్ట్రీ రైతులు అంటున్నారు. కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్ లో డిమాండ్ పెరిగి, ధరలు భారీగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. అయితే పెరిగిన ధరలతో తమకు నష్టమేనని చికెన్ వ్యాపారులు అంటున్నారు. ధరలు పెరగడంతో విక్రయాలు తగ్గుతున్నాయని వాపోతున్నారు. ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు క్వాంటిటీ తగ్గిస్తున్నారు. కిలో తీసుకునే వాళ్లు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు అంటున్నారు.ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గిందని ఫౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కోళ్లు భారీగా చనిపోయాయని ఫౌల్ట్రీ రైతులు తెలిపారు. ఏప్రిల్ నెలలో కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 వరకు నడిచింది. కోళ్ల దాణా ధరలు పెరగడంతో కోళ్లు పెంపకాన్ని తగ్గించారు రైతులు. ఈ కారణాలతో చికెన్ ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. చికెన్ ధరలు రూ.300లకు చేరితో… మటన్ ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వరకు కిలో రూ.700 పలికిన మటన్‌ ధర ఇప్పుడు రూ.900 వరకు చేరింది. మండీ మార్కెట్‌ జీవాల రేట్లు పెంచేయటంతో మటన్ ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మేకలు, పొట్టేళ్ల ధరలు అమాంతం పెంచేశారని చెబుతున్నారు. చికెన్, మటన్ ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు ముక్క ముట్టుకోవాలంటే కాస్త ఆలోచిస్తున్నారు. అయితే పెరిగిన ధరలు త్వరలోనే మళ్లీ తగ్గుముఖం పట్టాలని కోరుతున్నారు.హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో గత వారం కిలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ ధర రూ.250 నుంచి రూ.280 వరకు పలికింది. ఇప్పుడు ఈ ధర ఏకంగా రూ. 300కు చేరుకుంది. మరో 15 రోజుల పాటు చికెన్‌ ధరలు ఇలానే ఉంటాయని మాంసం వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు, వాతావరణ మార్పులతో కోళ్ల ఉత్పత్తి తగ్గిందని, దాణా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయంటున్నారు. జూన్‌ వరకు ఈ పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్లో గత ఆదివారం స్కిన్‌ లెస్‌ కిలో రూ.270 వరకూ ఉండగా ఇప్పు డు రూ.40 పెరిగింది. కోళ్ల దాణా, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని.. ఇవి కూడా రేట్లు పెరగడానికి కారణమంటున్నారు వ్యాపారులు. ఇప్పటికే పెరిగిన కూరగాయలు, పప్పుల ధరలకు తోడు.. కోడికూడా సామాన్యుడికి అందనంటోంది. మొన్నటి వరకు వారం రోజులకు ఒకసారి తినాలనుకునేవాళ్లు.. ఇప్పుడు ఆలోచించి మరీ తీసుకుంటున్నారు. నెలకు నాలుగుసార్లు తినేవాళ్లు రెండుసార్లు తింటున్నారు. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటున్నారు. ఎవరైనా బంధువులు వచ్చినా.. నాన్‌వెజ్‌ పెట్టలేకపోతున్నామన్న బాధ పేద, మధ్యతరగతి కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బిర్యానీ, కర్రీపాయింట్లలోనూ గిరాకీ తగ్గిందని చెబుతున్నారు వ్యాపారులు. ఒకప్పుడు రోజూ 20 కిలోల వరకు అమ్మే వ్యాపారులు.. ఇప్పుడు 10 కిలోలతో సరిపెట్టాల్సి వస్తోందని చెబుతున్నారు.చికెన్‌ రేట్ల పెరుగుదలతో… రిటైల్‌ వ్యాపారులు కూడా డీలా పడిపోయారు. ఒకప్పుడున్నంత గిరాకీ ఇప్పుడు లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చికెన్‌ ధరలు పెరగడంతో రిటైల్‌ చికెన్‌ విక్రయాలు భారీగా పడిపోయాయని వ్యాపారులు తెలిపారు. వినియోగదారులు తగ్గారని, మొన్నటి వరకూ రోజుకు 20 కిలోల విక్రయాలు జరిగేవి.ఇప్పుడు 10 కిలోలకు మించడంలేదని ఓ వ్యాపారి తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్