భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

- Advertisement -

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు వీఐపీ భద్రత కల్పించారు. ఈ మేరకు ఆయనకు జెడ్‌ కేటగిరీ కింద వీఐపీ భద్రతను కల్పించారు. ఈ మేరకు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుఆర్‌ సాయుధ కమాండో దళాలు పూర్తి భద్రతను కల్పించనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాజీవ్‌ కుమార్‌కు ముప్పు పొంచి ఉందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికార వర్గాలు జెడ్‌ కేటగిరి భద్రతను నియమిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు ముప్పు పొంచి ఉందనీ.. భద్రతా ఏజెన్సీలు కేంద్రప ప్రభుత్వానికి ఇటీవల సిఫార్సు చేశాయి. వారి సిఫార్సులను పరిశీలించిన కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ కుమార్‌కు జెడ్‌ కేటగిరి కింద వీఐపీ భద్రతను ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు రక్షణ విధుల్లో పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular