- Advertisement -
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం
Chief Minister's Relief Fund is a boon to poor peopleకోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల,
ఆనారోగ్య సమస్య వల్ల ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆదుకుంటుందని,దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరంగా మారిందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. గురువారం పట్టణం లోని జిఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్ పల్లి, మాల్లాపుర్, ఇబ్రాహాంపట్నం మండలాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నర్సింగరావు విచ్చేసి 28 లక్షల 4వేల రూపాయల విలువ గల 72 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తుందని అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్య వల్ల బాధపడుతున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చయిన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా అందజేయడం జరుగుతుందని ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్ప నర్సయ్య, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల అధ్యక్షులు కొంతం రాజం, మెట్పల్లి మండల అధ్యక్షులు అంజిరెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి,మహిళా పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, వార్డు కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, జిందం లక్ష్మీనారాయణ, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నం అనిల్,జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు వసీమ్, పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, సంఘ లింగం,మ్యాకల నర్సయ్య,నాయిమ్, ఎంభేరి సత్యనారాయణ,చిటిమేల్లి రంజిత్ గుప్తా, రిజ్వాన్ పాషా, ఏ ఆర్ అక్బర్, సోగ్రాభి, చిలువేరి విజయ్ తెడ్డు, విజయ్, రూపాలత, అశోక్, శ్రీరాముల అమరేందర్, కండ్లె నరేష్, జగనాథ్ లక్ష్మణ్, వాసిద్, ఆయుబ్ నర్సయ్య, కరుణాకర్ రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -




